Wednesday, 2 January 2013
Tuesday, 1 January 2013
మా ఊరి తిట్లు ...
మా ఊరి తిట్లు ...
ఏమయ్యా !
ఏమి మనిషివి ? మట్టి తింటున్నావా? లేక గడ్డి తింటున్నావా ? మనిషివా లేక పశువా ? ఇలా మొదలు అవుతుంది మా ఊరిలో బాష . నిజానికి ప్రతి ఒక్కరు కుటుంబంలా కలిసి ఉంటారు
పరిస్థితిని అర్ధం చేసుకునేలా అర్ధం అయ్యేలా మాటలడుతుంటారు .
ఇది తిట్టు కాదు అండీ సుమా! మా పాలిట ఒక వరాల మూట .మా మంచి కోరి ,
మా నడవడిక మంచి దారి తప్పకూడదని . లోక కల్యాణం లా మొదలు పెట్టె పురాణం .మంచి జేరగాలని , మంచిగా ఉండాలనే ఒక కాంక్ష .
అవునండి , తెలియక అడుగుతున్న !
ఈ తిట్టు ఎప్పుడయినా విన్నారా?
'' వయస్సు పెరిగంది కాని బుద్ది పెరగలేదు'' .
'' ఎందుకయ్యా విషయాన్నీ కాషాయం చేస్తున్నావు'' అని గద్దించే ఇలాంటి తిట్లు మనిషిని మంచి నడవడికకు పూలబాట అవుతుంది .
మీకు కష్టంగా ఉందా ? అయితే మా ఊరికి రండి . కొత్త గూడెం ఒక చిన్న ప్రదేశం. నిజానికి మా తల్లి మా జన్మ స్తలం . మా మంచి భగవంతుడు మా మంచి కోరి ,ఏరి అవకాశంగా మార్చిన వరం
'' మా కొత్తగూడెం '.
నా న పేరు కళాసాగర్ . విదేశాలకు వెళ్లి చదివినా .కారు ,బంగ్లా,హోదాలు సంపాదినిచినా , చూసినా . ఎ హోదాలో ఉన్నా మా ఊరు ఒక తియ్యని స్మరణం.ఎన్ని సార్లు స్మరించినా ,మాటలాడిన ,స్మరించినా కొద్దీ మాటలకు అందని తియ్యదనం .ఏమ్మయా కళాసాగర్ లండన్ వెళ్ళావట కదా ?ఎలా ఉంటుంది లండన్?బాగా డబ్బు సంపాదించావు ఆటా? అదృష్టవంతుడవు .ఈ ఊరి గాలి,నీరు నీకు చాల మంచి చేసిందయ్య .మరిచిపోకు మమ్మల్ని ,ఈ ఊరిని ఇలా పలకరిస్తూ , ఎలా ఉన్నారు అమ్మ ,నానా ,అన్నలు ,అక్కలు ,చేల్లిలు ,తమ్ముడ్లు ఇలా ప్రేమగా అప్యాయతగా పలకరిస్తూ మంచి చెప్తూ మంచి కోరుకుంటారు అండి మా కోతగుడెం వారు.జాగ్రత్త బిడ్డ అమ్మని ,అక్కని , అందరిని మంచిగా చూసుకో బిడ్డ. మరి నిమ్మళం. నీ కోరిక సఫలం అయ్యింది కదా కుటుంబానికి కొంచం సహాయంగా ఉండు బిడ్డ . పైలం జేర.
మీరే చెప్పండి ఎలా మరిచిపోమంటారు?మా ఊరు, మా ఊరివాళ్ళని ,కుటుంబంలో మంచి ,చెడ్డ ఉండటం సహజం.ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉగాది పచ్చడిల ఉంటుంది మా కోతగుడెం .ఏమయ్యా కళాసాగర్ ఎటువేల్తున్నావు?ఒక వేల బజార్ వైపు వెళ్తే కొన్ని కూరగాయలు తెచ్చి పెట్టు నానా.ఇదిగో డబ్బు ,చిల్లర నీ ఇష్టం.ఇలా పలుకుతూ,పలకరిస్తుంటారు మా ఊరిలో వారు.
నిండు ముత్తైదు ల ఉంటుంది మా ఊరు.
మాట తీరు కొట్టినట్టు ఉన్నా. మనసులో ఏ కల్మషం లేని వాళ్ళు .
అందుకేనేమో ఆ భద్రాచల రాముడు ,కిన్నెరసాని మమ్మల్ని విడలేని బందంలా అనుకోని ఉంటాయి .మీరు బద్రాచలం రాముడు దగ్గరికి వెళ్తున్నార?అయితే మా ఊరి పరిమళం తెలిసో తెలియకో ఆస్వదించలిసిన్దె . మీరు కొత్తగూడెం వారా? చాలా కాలం అయ్యిందా కొత్తగూడెం వెళ్లక?అయితే ఇంత కన్నా మంచి కారణం అవకాశం ఏమి ఉంటున్నది. రండి స్నేహాన్ని మరిపించే మంచి స్నేహితులు . తల్లిని మరిపించే స్నేహితుల తల్లులు.జువ్వు మని రెండు చేతులతో మొకాన్ని చేతుల్లో తీసుకొని ''ఎన్నాలు అయ్యింది బిడ్దా అని కంటి నిండా ప్రేమతో కన్నీళ తో పలకరించి.ఆరోగ్యం ఎలా ఉంది బిడ్డ?అమ్మ ,ఇంట్లో అందరు కులసయేగా ? ఇలాంటి ఆప్యాయత బహుగా లబిస్తుంది.
''మిత్రమా ఇది అర్దికమయిన ప్రేమ కాదు సుమా''.
రా బిడ్డ నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్టే ఉంది.నా కొడుకు రాక చాల కాలం అయ్యింది బిడ్డ.దూర ప్రదేశం లో ఉద్యోగం కదా.
ఒక్క నిముషం అని చెక , చెకా అన్నం ,కూర వండి.ఎప్పుడు తినని అమృతం లాంటి గుడ్డు కూర .గుడ్డు కూర అందరూ తినటారు . కాని మా అమ్మ '' గుడ్డు కూర ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ''.
మంచిగా వేపిన ఉల్లిపాయలు ,కారం,టమాట ,పెరుగు .
మాకు ఆస్తులు,పొలాలు,కులాలు లేవండి.కాని మీరు మా ఊరికి వస్తే కడుపు నిండా భోజనం ,నిండు కుండ లాంటి ప్రేమ అండీ!
ఒక్క క్షణం ఆలోచించండి ''శ్రీరాముడు తాకిన గడప మా ఊరు.నిజానికి భద్రాచల రాముడు కి గడప మా ఊరు''.
అడవిలో నక్కలు ఉంటాయి అన్నది ఎంత నిజామో. ఉన్నారు అండి మా గొర్రెల మా ఊరివారు.
కొన్ని నక్కలు ఉన్నాయండి.కాని,నా అనుభవంలో నేను తోడేలు చూసానండి .తోడేలు కంటే నక్క నయం కదా.రోకళ్ళు మింగే సమాజంలో ఆకలిని తీర్చుకొనే ప్రయత్నం చసేవాళ్ళు మా ఊరివాళ్ళు.
ఉన్నారు అండీ ఈ పున్యస్థలoలో కొడుకుని గొప్పగా ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన తల్లులు ఎందరో ఉన్నారు.ఆ తల్లులందరికి మా వందనాలు.నాకు తెలిసిన ఒక గొప్ప తల్లి ఆమె గొప్పతనం చాటడానికి నేను గోరంత వాడిని .చదువులో ఉండే ప్రాదాన్యత, ఒక దృడమైన సంకల్పం కొడుకులో నెలకొల్పిన ఓ తల్లి తన కొడుకుని కలెక్టర్ గా తీర్చిన ఘనత మా ఊరిలో ఉంది.ఇలా ఎందరో నేషనల్,గేమ్స్ ఆడినవారు కూడా ఉన్నారు.
రాముడు తాకిన రాయికే ఎంతో ప్రాదాన్యత ఉంటె .లోక కళ్యాణ శ్రీ రాముడుకి గడపగా నిలిచినా మా కొత్తగుడెం ఎంత గొప్పదో మీరే ఆలోచించుకోండి?
బతకమ్మ ,మా ఊరి పండుగ ,తెలంగాణ పండుగ,ఊరంతా పండుగ ,పట్టు చీర ,చేతినిండా గాజులు,నుదిటిన దిద్దిన బొట్టు,అన్నిటికన్నా బతుకమ్మ తల్లిని అలంకరించిన విదానం.
ఊరంతా ఒకే చోట ,ఒకే పాట ,ఒకే బాట చూడటానికి రెండు కళ్ళు చాలవు.ఇక్కడ జేరిగే ప్రతిది వర్ణనాతీతం.
ఎకలువ్యుడుని సైతం ప్రోత్సహించే గుణం.గురువులను మించన శిశువులు,పుణ్యంకొద్దీ పురుషులు కూడా ఉంటారుండి ఇక్కడ.
మా అలవాటు ఆతిధ్యం ఇలా ఉంటుంది '' ఇంటికి వచ్చిన వారికి నీళ్ళు పెట్టి పూర్తియ్యాక వారికి తువ్వాల ఇచ్చి ఆ తరవాత మంచి భోజనం ,కబుర్లు ...ఇలా ఎన్నో .....ఎన్నెన్నో
ప్రేమ ,ఆప్యాయత మా కులం.
మా ఊరిలో కోటలు లేవండి,కాని కోటను సైతం పెకిలించే ప్రేమ ,ఆప్యాయతలు మా మనస్సులో నిరంతరం ఉంటాయి.
ఏరా సాగర్ ! అన్న...... ఏంటి రాత్రి 11 గంటలకు ఇక్కడ ఏమి పనిరా ఇంటికి నడువ్వ్,''కాలు చెయ్యి రెక్కలు విరగకోడాత '' సరే అన్న!
మా అన్నయ ఫ్రెండ్ అండీ అన్నయను చూసినంత భయం. అన్నయ్యలా భాధ్యత .
ఇది తిట్టు కాదండోయ్ !
మా ఊరిలో ప్రేమ ,మమ్మల్ని మంచి దారిలో పెట్టె మందలింపు .
ఇదండీ మా ఊరు ''కొత్తగూడెం ప్రేమ''
ఇక ఉంటానండి అన్నయకి కోపమ్ వస్తుందేమో?
సెలవు
కళాసాగర్ (kothagudem ).........మరిచిపోయా !
మనసు కష్టం గా ఉంటె మా కొత్తగూడెం కి రండి అలా కిన్నేరసానికి వెళ్లి అలా శ్రీ రాముడి దర్శనం చేసుకుందాం......సుఖీభవ
Subscribe to:
Comments (Atom)
